మాంకీ... టెంపరరీ కెప్టెన్ వచ్చాడు... ఆసీస్ కెప్టెన్‌ను ఆటాడుకున్న పంత్

శనివారం, 29 డిశెంబరు 2018 (17:36 IST)
క్రికెట్ ఆటంటే అదోటైపు. ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడం, నోటి దురుసు మాటలు మాట్లాడకోవడం, కొన్నిసార్లు కలబడుకోవడం వంటివి వుంటాయి. ముఖ్యంగా ఇది బ్యాట్సమన్ బౌలర్ వేసే బంతులను చీల్చి చెండాడుతున్నప్పుడు జరుగుతుంటాయి. ఇలాంటిదే ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్లోనూ జరిగింది. బ్యాట్సమన్ పంత్ ఆడుతుండగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ అతడిపై స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు.
 
నోటి దురుసు ప్రవర్తిస్తూ... ధోని వచ్చాడు కదా, ఇప్పుడేం చేస్తావ్‌? వచ్చి బీబీఎల్‌ ఆడుతావా? అంటూ ఎగతాళి మాటలు మాట్లాడాడు. ఆ మాటలకు పంత్ ఎంతమాత్రం రెచ్చిపోకుండా తన ఆటను కొనసాగించాడు. ఇక ఆట ఆసీస్ చేతికి వచ్చింది. దాంతో స్లెడ్జింగ్‌ చేయడంలో తానేం తక్కువ కాదని నిరూపించుకున్నాడు యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.
 
మూడో టెస్ట్‌లో ఆ జట్టు కెప్టెన్‌ టీమ్‌పైన్‌కు బుద్ధి చెప్పే రీతిలో.... ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మయాంక్‌తో ఇలా అన్నాడు. "మాంకీ.. ఈ రోజు నీకు ఓ ముఖ్య అతిథి కనిపిస్తాడు ఇలా చూడు. కమాన్‌ మాంకీ కమాన్. ఎప్పుడైనా, ఎక్కడైనా టెంపరరీ కెప్టెన్‌ అనే పదం విన్నావా? అతను ఔట్‌ అవ్వడానికి అంతగా కష్టపడాల్సిన అవసరమే లేదు. ఈ టెంపరరీ కెప్టెన్‌కి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. అదొక్కటే అతను చేయగలడు." అంటూ ఎద్దేవా చేశాడు. పంత్ మాటలు మైకులో స్పష్టంగా రికార్డయి వినిపించాయి. కొసమెరుపు ఏమిటంటే... పైన్ తన వికెట్టును పంత్‌కే సమర్పించుకోవడం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు