ఫలితంగా ఆ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగా 126 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసుకోగా, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ తీసుకుని విజయంలో తమవంతు పాత్ర పోషించారు.
సూర్యకుమార్ యాదవ్ (50) అర్థ సెంచరీతో అలరించగా, ధవన్ 46, సంజు శాంసన్ 27, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేశారు. వన్డే సిరీస్‌లో విఫలమైన హార్దిక్ పాండ్యా (10) మరోమారు తడబడ్డాడు. శ్రీలంక బౌలర్లలో చమీర, హసరంగ చెరో రెండు వికెట్లు తీసుకోగా, కరుణరత్నె ఒక వికెట్ పడగొట్టాడు.
ఆ తర్వాత 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన శ్రీలంక జట్టు 126 పరుగులకే ఆలౌట్ అయింది. లంక ఆటగాళ్ళలో చరిత్ అసలంక చేసిన 44 పరుగులే అత్యధికం. అవిష్క ఫెర్నాండో 26, దాసున్ శనక 16, మినోద్ భానుక 10 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేదు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రేపు జరుగుతుంది.