భారత బౌలర్లకు చుక్కలు.. అయినా బెన్ స్టోక్స్ అవుట్

శనివారం, 6 ఫిబ్రవరి 2021 (14:30 IST)
ఇంగ్లండ్ మ‌ధ్య చెన్నైలో జ‌రుగుతోన్న తొలి టెస్టు మ్యాచు రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ క్రీజులో పాతుకుపోయి త‌న జోరును కొన‌సాగిస్తున్నాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి జో రూట్ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టిస్తున్నాడు.
 
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికెట్లు తీయడంలో తెగ ఇబ్బందిపడుతున్నారు. అయినా ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఔటయ్యాడు. 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను స్పిన్నర్ నదీమ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. 
 
స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన స్టోక్స్‌.. డీప్ లెగ్‌లో ఉన్న పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. దాదాపు క్యాచ్‌ను వదిలేసినంత పని చేసిన పుజారా.. చివర్లో ఆ క్యాచ్‌ను అందుకుని స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు.
 
స్టోక్స్‌, రూట్‌లు నాలుగవ వికెట్‌కు 124 రన్స్ జోడించారు. మరో వైపు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్.. డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. 175 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ 132 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 400 రన్స్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు