భారత్- ఇంగ్లాండ్‌ల టీ-20 సిరీస్.. కోహ్లీ సేన ఖాతాలో రికార్డుల పంట

సోమవారం, 8 మార్చి 2021 (16:27 IST)
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదు టీ-20ల సిరీస్ మార్చి 12 నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది. ద్వితీయ స్థానంలో న్యూజిలాండ్ కొనసాగుతుంది. 
 
తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో మరో అరుదైన రికార్డును లిఖించింది. ఈ సిరీస్‌లో టీమిండియా బౌలర్లు 25 మందిని ఎల్బీలుగా ఔట్‌ చేశారు. ఇదే టీమిండియా తరఫున అత్యధికంగా నమోదైంది. గతంలో రెండు సందర్భాల్లో టీమిండియా బౌలర్లు 24 వికెట్లను ఎల్బీల రూపంలో సాధించారు. 40 ఏళ్ల క్రితం ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత బౌలర్లు 24 ఎల్బీలు చేయగా, 2016-17లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో 24 మంది వికెట్లను ఎల్బీలతో వెనక్కి పంపారు. 
 
అదే సీజన్‌లో న్యూజిలాండ్‌ జరిగిన టెస్టు సిరీస్‌లో భారత బౌలర్లు 22 మందిని ఎల్బీలుగా పెవిలియన్‌కు పంపారు. టీమిండియా తరపున టాప్‌-4 జాబితాలో ఇవి ఉండగా, తాజా సిరీస్‌లో ఎల్బీలు అగ్రస్థానాన్ని ఆక్రమించాయి. 25 మందిని ఎల్బీలుగా ఔట్‌ చేశారు. ఈ రెండు రికార్డులను బద్దులు కొడుతూ ఇంగ్లాండ్‌ సిరీస్‌లో సరికొత్త రికార్డును సృష్టించారు టీమిండియా బౌలర్లు.
 
సొంత గడ్డపై భారత్‌తో ఆడాలంటే ప్రత్యర్థి క్రికెట్ జట్లకు ఎప్పుడూ వెన్నులో వణుకే. ఇక ఆస్ట్రేలియా గడ్డపై ఎన్నో ప్రతిబంధకాల మధ్య జరిగిన సిరీస్‌లో ఘన విజయం సాధించిన తరువాత టీమిండియాను స్వదేశంలో ఎదుర్కోవడం అంటే.. మామూలు విషయం కాదు. ఇంగ్లాండ్ జట్టు భారత్ లో అడుగుపెట్టే సమయంలో క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న అభిప్రాయం అది. కానీ తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్గ్లాండ్ ఆటగాళ్ళ ధాటికి టీమిండియా చేతులెత్తేసింది. దీంతో అందరూ భారత్‌ పనైపోయిందనుకున్నారు... నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ ఓడిపోవడం అంటే ఏ జట్టుకైనా పెద్ద ఎదురుదెబ్బే. 
 
ఆ గాయాన్ని తట్టుకుని మిగిలిన మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ టీంకు చుక్కలు చూపించింది టీమిండియా. వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ లను తిరుగులేని ఆధిక్యంతో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల తీరు చూస్తే టెస్ట్ క్రికెట్ లో ఏ టీంకైనా చెమటలు పట్టాల్సిందే. కేవలం మూడు రోజుల్లో మ్యాచ్ ముగించి.. తన బలాన్ని టెస్ట్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది టీమిండియా.
 
టీమిండియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో వెయ్యి పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. మోతెరా స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ రికార్డుకు వేదికగా నిలిచింది. అతితక్కువ ఇన్నింగ్స్‌ల్లో అత్యంత ఫాస్ట్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
 
ఈ జాబితాలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 948 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ 848 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు డొమినిక్ సిబ్లి 841, మయాంక్ అగర్వాల్ 810 పరుగులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు