ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ (89) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, వందో టెస్టు ఆడుతున్న రాస్ టేలర్ (44) రాణించాడు. ఓపెనర్ టామ్ లాథమ్ (11)ను ఇషాంత్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చినా.. మరో ఓపెనర్ టామ్ బ్లండెల్ (30), టేలర్‌తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
నిజానికి కివీస్ జోరుకు భారత బౌలర్లు ఓ దశలో బ్రేక్ వేశారు. వెంటవెంటనే మూడు వికెట్లు తీసి పుంజుకున్నారు. టేలర్‌ను ఔట్ చేసిన ఇషాంత్ మూడో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసి బ్రేక్ ఇవ్వగా.. విలియమ్సన్‌ను ఇషాంత్, నికోల్స్ (17)ను అశ్విన్ వెనక్కు పంపారు. ప్రస్తుతం బీజే వాట్లింగ్ (14 బ్యాటింగ్), గ్రాండ్ హోమ్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇషాంత్ కు మూడు, షమీ, అశ్విన్ కు ఒక్కో వికెట్ దక్కింది.
ఆపై, వరుస ఓవర్లలో ఇషాంత్ (5)ను జెమీసన్, షమీని సౌథీ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ బౌలర్లలో జెమీసన్, సౌథీ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా భారత్‌పై కివీస్ ఆధిపత్యం సాధించింది.