భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు వరుణుకు అడ్డంకిగా మారాడు. ఈ వర్షం దెబ్బకు తొలి రోజు ఒక్క బంతికూడా పడకుండానే మ్యాచ్ ముగిసింది. రెండో రోజున కాస్త తెరపివ్వడంతో కొంతమేరకు సాధ్యమైంది.
రెండో రోజున టాస్ గెలిచిన కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి 44, రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత ఓపెనర్లు రోహిత్, గిల్ జోడీ తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం అందించింది.
అయితే, ఆదివారం మొత్తం ఆకాశం మేఘావృతమై, మధ్యమధ్యలో వర్షం పడే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్‌కు అంతరాయాలు తప్పేలా లేవు. ఆ లెక్కన పూర్తి రోజు ఆట అసాధ్యమనే చెప్పాలి.