Blasting Roar from Akhanda 2
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ అఖండ 2 నుంచి బ్లాస్టింగ్ రోర్ అంటూ ఓ సాలిడ్ అప్డేట్‌ను వదిలారు. ఈ బ్లాస్టింగ్ రోర్ వీడియో గ్లింప్స్‌తో బాలయ్య ప్రతినాయకుడితో వార్నింగ్ ఇస్తూ ఆవేశంగా పలికే డైలాగ్ లు ఆయన ఆయన మార్క్ ను తెలియజేశాయి. సౌండ్ కంట్రోల్ లోపెట్టుకో ఏ సౌండ్ కు నవ్వుతానో.. ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలియదు కొడకా.. అంటూ వార్నింగ్ తో బాలయ్య గర్జన సింహంలా వినిపించగా, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్స్ థమన్ సౌండ్ తో అదిరిపోయాయి. చివర్లో ఆయన కాలు మోపగానే గుర్రాలు భయంతో దూకడం పక్కా మాస్ ఎలివేషన్ ఇచ్చాడు బోయపాటి.