అయితే, ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క వికెట్ తీస్తే మాత్రం తన పేరిట కొత్త రికార్డును లిఖించుకుంటారు. పవర్‌ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన అంతర్జాతీయ టీ20 బౌలర్‌గా నిలుస్తాడు. ఇంతకుముందు కటక్ వేదికగా జరిగిన రెండో టీ20లో భువి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
అందులో మూడు వికెట్లు పవర్‌ప్లేలోనే వచ్చాయి. దీంతో టీ20 పవర్‌ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్ బౌలర్ సామ్యూల్ బద్రీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్‌సౌథీ సరసన నిలిచాడు. ప్రస్తుతం ఈ ముగ్గురూ తలా 33 వికెట్లు తీసి తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
అందులో భువనేశ్వర్ 59 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో నిలవగా.. సామ్యూల్ 50 ఇన్నింగ్స్‌ల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. సౌథీ 68 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా పేసర్ నేటి మ్యాచ్‌లో మరోసారి వికెట్లు పడగొడితే.. వారిద్దర్నీ వెనక్కినెట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు.