అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ(211), రహానేలు(188) భారీ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో రెండో రోజు ఆటలో 169 ఓవర్లు ముగిసే సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసి టీమిండియా కివీస్‌ను బ్యాటింగ్‌కు దింపింది. మరో మూడు రోజులు ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.
ఈ ఇన్నింగ్స్‌లో 100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన స్థితిలో విరాట్ కోహ్లీకి జతగా అజింక్య రహానే వచ్చిన తర్వాత మూడో టెస్టు రెండో రోజు ఆటే మారిపోయింది. విరాట్ కోహ్లీ, రహానేలు 150 పరుగుల మైలురాయిని దాటేసి జట్టు స్కోరును ముందుకు సాగించారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీని దాటేశాడు.
మొత్తం 347 బంతులాడిన కోహ్లీ 18 ఫోర్ల సాయంతో 200 పరుగులు చేసి.. తన వ్యక్తిగత స్కోరు 211 పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత రహానే కూడా 188 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం జరిగింది. కివీస్ బౌలర్లలో జేఎస్ పటేల్‌కు 4 వికెట్లు దక్కగా, హెన్రీకి మూడు వికెట్లు లభించాయి.