విశ్వ వేదికలపై భారత విజయయాత్రకు బ్రేక్ వేస్తాం : ఇంజమాముల్ హక్

సోమవారం, 27 మే 2019 (09:17 IST)
విశ్వవేదికలపై ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లలో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోతోంది. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌లలో పాకిస్తాన జట్టు ఓడిపోయింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్, మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ స్పందించాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో మాత్రం భారత్ జైత్రయాత్రకు బ్రేక్ వేస్తామని తెలిపారు. 
 
ఐసీసీ నిర్వహించే ఈ వరల్డ్ కప్ పోటీలో వచ్చే నెల 16వ తేదీన భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా భారత్‌ను ఓడించి తీరుతామని చెప్పారు. అయితే, ప్రపంచ కప్ అంటే కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదనీ, మిగిలిన మ్యాచ్‌లు కూడా ఆడాల్సివుందన్నారు. 
 
అయితే, బౌలర్ల విషయానికొస్తే ఎవరిని తీసుకోవాలనేది ఒకపట్టాన అంతుచిక్కడం లేదన్నారు. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నపుడు వారిలో ఎవరికి అవకాశం ఇవ్వాలో అర్థం కాదన్నారు. ప్రపంచకప్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేసేందుకు లేదన్నారు. 
 
ఆఫ్ఘనిస్థాన్‌లాంటి జట్టు కూడా పెద్దపెద్ద జట్లను ఓడించగలదని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి మ్యాచ్ ముఖ్యమేనని చెప్పారు. ఎవరిపై గెలిచినా వచ్చేది రెండు పాయింట్లే. మెగాటోర్నీలో ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్ సెమీస్‌కు చేరే చాన్సుందని హక్ అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు