సాధారణంగా క్రికెట్‌లో సిక్సర్ కొడితే కొట్టిన బ్యాట్స్‌మెన్‌తో పాటు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు తెగ సంబరపడిపోతారు. కానీ, ఓ క్రికెటర్ మాత్రం సిక్స్ కొట్టి అపార నష్టాన్ని తెచ్చుకున్నాడు. సిక్స్ కొట్టడమేంటి.. నష్టమేంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.
ప్రస్తుతం ఐర్లాండ్‌లో ఓ దేశవాళీ టీ20 లీగ్ జరుగుతోంది. అందులో భాగంగా నార్త్ వెస్ట్ వారియర్స్, లీన్‌స్టర్ లైట్నింగ్ జట్ల మధ్య గురువారం ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లీన్‌స్టర్ జట్టు తరపున ఆ దేశ జాతీయ జట్టు క్రికెటర్ కెవిన్ ఓబ్రెయిన్ బరిలోకి దిగాడు.
తీరా ఆ కారు ఎవరిదా అని చూస్తే.. అది కెవిన్ కారే.. సిక్స్ కొట్టి సొంత కారుకే నష్టం కలిగించుకున్నాడు. మ్యాచ్ ముగిశాక కెవిన్ ఓబ్రెయిన్ తన కారును రిపేరింగ్ షాప్‌కు తీసుకెళ్లాడు. ఆ కారు ఫొటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. 'ఇక నాకు కారులో ఏసీతో పనిలేదు. కానీ మరోసారి మాత్రం కారును దూరంగా పార్క్ చేస్తాన' అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు.