ఓటు వేసేందుకు మా వంతు వచ్చేవరకు వేచిచూశాం. ఇలాగే ప్రతి ఒక్కరూ దేశ పౌరులుగా మీ ఓటు హక్కు వినియోగించుకోండని కుంబ్లే తెలిపారు. కుంబ్లే చేసిన పోస్టుకు షేర్లు, లైకులు వెల్లువెత్తుతున్నాయి. పోస్టు చేయగానే దీనికి 17 వేల మంది లైక్ కొట్టగా, 200 మంది రీట్వీట్ చేశారు.
కర్ణాటకలో శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 58,546 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆరు గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇక బీఎన్ విజయ్ నగర్ మృతి చెందడంతో జయనగర్ పోలింగ్ వాయిదా పడగా.. నకిలీ ఓటర్ ఐడీ కార్డుల కలకలంతో ఆర్‌ఆర్ నగర్ ఎన్నిక వాయిదా పడింది.