Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

చిత్రాసేన్

బుధవారం, 22 అక్టోబరు 2025 (18:09 IST)
Prabhas pre-look poster
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషలో సినిమా ప్రీ-లుక్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ-లుక్ రిలీజ్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. నేడు విడుదలచేసిన పోస్టర్ లో... ఒంటరిగా నడిచే బెటాలియన్ -  1932 నుండి మోస్ట్ వాంటెడ్.. తిరుగుబాటుదారుడు కొత్త రూపంలో యుద్ధంలోకి తిరిగి వచ్చాడు.

1940ల వలస భారతదేశం యొక్క మట్టి నుండి, ఒక ఒంటరి బెటాలియన్ పైకి లేస్తుంది - సైన్యంతో కవాతు చేయని వ్యక్తి... అతను విధిని స్వయంగా శాసిస్తాడు. అతను కేవలం సైనికుడు కాదు - అతను సామ్రాజ్యం విచ్ఛిన్నం చేయలేని సంకేతం అంటూ బ్రీఫ్ గా సినిమా గురించి వెల్లడించారు.
 
పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టి సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ప్రభాస్ రేపు తన పుట్టినరోజును జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా, మేకర్స్ అభిమానుల కోసం ఒక ప్రత్యేక సర్ప్రైజ్‌ను సిద్ధం చేశారు. టైటిల్ పోస్టర్‌ను రివిల్ చేయనున్నారు. 
 
ప్రీ-లుక్ పోస్టర్ ఒక మిస్టీరియస్, ఇన్‌టెన్స్ వాతావరణాన్ని ప్రజెంట్ చేస్తోంది. బ్రిటిష్ పాలన కాలంలో నడిచే ఒక ఎపిక్ హిస్టారికల్ డ్రామాకు టోన్ సెట్ చేస్తోంది. పోస్టర్‌లో ప్రభాస్‌ లాంగ్ కోట్, బూట్స్ వేసుకుని, ఒక కాలు మరో కాలిపై వేసుకుని నిలబడి ఉన్నట్లు కనిపించారు. వెనుక గోడపై కనిపించే సైనికుల సిల్హౌట్స్ యుద్ధం, తిరుగుబాటు వాతావరణాన్ని చూపిస్తున్నాయి.
 
“A Battalion Who Walks Alone”, “Most Wanted Since 1932”  పోస్టర్‌పై ఉన్న ఈ వాక్యాలు  ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రని సూచిస్తున్నాయి. బ్యాక్ డ్రాప్ లో యూనియన్ జాక్ జెండా బ్రిటిష్ పాలనా కాలాన్ని గుర్తు చేస్తుంది.  పోస్టర్‌లో ఉన్న భగవద్గీత శ్లోకాలు ఈ కథకు ఫిలాషఫికల్ డెప్త్ ని యాడ్ చేస్తున్నాయి.
 
ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ (ISC) నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. అనిల్ విలాస్ జాధవ్  ప్రొడక్షన్ డిజైనర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
 
తారాగణం: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భాను చందర్  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు