ప్రతిష్టాత్మక ఆస్కార్ సంబరాల్లో (97వ అకాడమీ అవార్డ్స్ లో) ఈ ఏడాది మన తెలుగు హీరో సందడి చేశాడు. చాలా అరుదుగా మాత్రమే ఆరుదెంచే ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్న ఆ తెలుగు తేజం పేరు రాజ్ దాసిరెడ్డి. రాజాసాబ్ తో పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్న మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన రాజ్ దాసిరెడ్డి... ఆస్కార్ - 2025 వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకొని, అక్కడకు వెళ్లడంతోపాటు, "హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్" "న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ - 2025"లోనూ సందడి చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న తన తదుపరి చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న దాసిరెడ్డి... అందుకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నాడు.