గ్రౌండ్‌లో సిక్సర్లు.. ఫోర్లతో రెచ్చిపోయే ధనాధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా కేఎల్ రాహుల్ పోస్ట్‌లకు అతియా శెట్టి స్పందించడంతో వీరీ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉందనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.