కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి రోజూ లక్షలాది మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. అయితే, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మాత్రం ఇది చిన్న విషయంగా కనిపిస్తోంది. కరోనా అనేది ఓ చిన్న ఫ్లూ మాత్రమేనని వ్యాఖ్యానించింది. 'ఇదో చిన్న ఫ్లూ మాత్రమే. అనవసరంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భయపడకండి. అందరం కలిసి దీనిని ఎదుర్కొందాం' అని కంగనా ఆ పోస్ట్‌లో రాసింది.
దీనిపై అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దేశంలో ఇన్ని కేసులు వచ్చి, ఇంత మంది చనిపోతుంటే ఇదో చిన్న ఫ్లూ అంటావా అంటూ చాలా మంది మండిపడ్డారు. దీంతో ఇన్‌స్టా ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కాగా, ప్రస్తుతం కంగనాకు కరోనా వైరస్ సోకింది.
కాగా, కంగనా రనౌత్ ఖాతాపై ట్విటర్ యాజమాన్యం శాశ్వతంగా నిషేధం విధించిన విషయం తెల్సిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అక్కడ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై అనుచిత పోస్టులు చేసిన కారణంగా ట్విటర్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.