ఇందులో మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా, శుభ్‌మాన్ గిల్ 45, చటేశ్వర్ పుజారా 17 పరుగులకు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన అజింక్యా రహానె అద్భుతంగా రాణిస్తూ సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 12వ సెంచరీ కావడం గమనార్హం. మొత్తం 195 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో వంద పరుగులు చేశాడు.
అంతకుముందు హనుమాన్ విహారి 21, రిషబ్ పంత్ 29 పరుగులు చేసి ఓటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానె 104, రవీంద్ర జడేజా 35 పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు తీశారు. లైయాన్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 276/5గా ఉంది.