ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కప్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు సెలెబ్రెషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో వరల్డ్ కప్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టి కనిపించిన ఫోటో చర్చనీయాంశమైంది. మార్ష్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలువురు మాజీ క్రికెటర్లు సైతం మార్ష్ చేష్టలను తీవ్రంగా ఖండించారు.
అయితే, ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం చేశారు. "నేను బాధపడ్డాను. ప్రపంచలోని అన్ని జట్లు పోరాడే ట్రోఫీ. ఆటగాళ్లు తలపైన పెట్టుకునేందుకు ఇష్టపడే ట్రోఫీపై కాళ్లు పెట్టడం నాకు సంతోషాన్ని కలిగించలేదు" అని మహ్మద్ మండిపడ్డారు.