ఈ ఓవర్ చివరి బంతి వేసేముందు సిరాజ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. క్రాస్ సీమ్ డెలివరీ వేయాలని సూచించాడు. షాట్ పిచ్ బాల్ వేస్తున్నట్లు ఫీల్డ్‌లో మార్పు చేసిన ఈ ఇద్దరూ బ్యాటర్‌ను తప్పుదోవ పట్టించారు. క్రాస్ సీమ్ డెలివరీలోగా రావడంతో అబ్దుల్లా షఫీక్ కనెక్ట్ చేయలేకపోయాడు. దాంతో అతను వికెట్ల ముందు దొరికిపోయాడు.