బిడ్డా.. నీవెప్పుడొస్తావు... ధోనీ రాక కోసం ఓ అమ్మ

శనివారం, 14 అక్టోబరు 2017 (12:30 IST)
మహేంద్ర సింగ్ ధోనీ… చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ దిగ్గజం. ఆపేరు వింటే అభిమానుల గుండెలు ఉప్పొంగిపోతాయి. అంతటి ఆటగాడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ జాబితాలో కళావతి అనే వృద్ధురాలు ఒకరు. ఈమెతో ధోనీ పరిచయం ఈనాటికి కాదు. 13 ఏళ్ల నాటిది. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ చెక్కింగ్ ఆఫీసర్‌గా ధోనీ పనిచేసినప్పటిది. 
 
అప్పట్లో ఆమెను అమ్మా అని పిలిచేవాడట. అక్కడ రైల్వే క్వార్టర్స్‌లో ధోనీ ఉన్నప్పుడు తల్లిలా చూసుకొనేది. ధోనీకి క్రికెట్‌లో అవకాశం రావడం... ఆ తర్వాత ఆమె రిటైర్డ్ అవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే క్రికెట్‌‍లోకి అడుగుపెట్టేటపుడు తప్పక వస్తానని కళావతికి మాటిచ్చాడట. కానీ ఇఫ్పటివరకు ఆమెను చూడటానికి ధోనీ వెళ్లలేదు. 
 
ఇప్పుడు కళావతి వయస్సు 77 ఏళ్లు. ఇప్పటికీ ఆమెకు ఓ నమ్మకం ఉంది. ధోనీ తప్పక వచ్చి తనను తనని పలకరిస్తాడన్న నమ్మకం. ఎవరైనా స్థానికులు ధోనీని కలవడానికి వెళితే.. ఎలా ఉన్నాడు.. తన గురించి అడిగాడా.. ఏమన్నాడు.. వస్తానన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుందట. ఇంతకీ ఈ అమ్మ చివరి కోరికను నెరవేర్చుతాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు