భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ ఏది చేసినా అది సంచలనమే అవుతోంది. ఆయన తాజాగా గంటకు 31 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తాడు. ధోనీ ఇలా ఎందుకు పరుగెత్తాడో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఈ కథనం చదవండి.
మూడు మ్యాచ్‌లో ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా ఈనెల 11వ తేదీన గౌహతి వేదిగా ఆస్ట్రేలియాతో భారత్ రెండో ట్వంటీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ.. ధోనీ మాత్రం ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఆ రికార్డు కూడా క్రీజ్‌లో పరుగెత్తడంలో. మ్యాచ్‌లో రెండో రన్ కోసం గంటకు 31 కి.మీ.ల వేగంతో ఆయన పరిగెత్తాడు.
ధోనీ రన్నింగ్ విశ్లేషణ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. 'ధోనీ రన్నింగ్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు' అంటూ స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు ఏకీభవిస్తూ వివిధ రకాలుగా స్పందించారు. 'ధోనీ బుల్లెట్ ట్రెయిన్ కంటే ఫాస్ట్', 'ధోనీ రికార్డు సృష్టిస్తే అంతే ఇక.. దాన్ని ఎవరూ దాటలేరు' అంటూ కామెంట్ చేశారు. ఇటీవల ఆగస్టులో నేషనల్ క్రికెట్ అకాడమీని సందర్శించినపుడు 20 మీటర్ల రేస్‌ను 2.91 సెకన్లలో ధోని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.