ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇప్పటిదాకా పది సంవత్సరాల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో.. ఏడుసార్లు ఫైనల్ ఆడనున్న క్రికెటర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఐపీఎల్‌లో మరో క్రికెటర్‌కి దక్కలేదు.
ఇందులో భాగంగా చెన్నై తరపున ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ రెండుసార్లు జట్టుకు ట్రోఫీని సంపాదించిపెట్టాడు. ఇప్పటికీ పుణే తరపున మరోసారి ఆదివారం జరిగే ఫైనల్ పోరులో బరిలోకి దిగనున్నాడు. చెన్నై జట్టు ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న తరువాత, రెండేళ్ల పాటు ఆ జట్టును బహిష్కరించిన సంగతి తెలిసిందే.
దీంతో ధోనీని పుణె జట్టు కొనుగోలు చేసింది. గత రెండు సీజన్ల నుంచి ధోనీ పుణే జట్టు ఆడుతున్నాడు. ఈ సంవత్సరం కెప్టెన్ బాధ్యతలకు దూరమైనా, అన్ని మ్యాచ్‌లలో స్టీవ్ స్మిత్‌కు చేదోడు.. వాదోడుగా నిలిచి తనదైన సహాకారాన్ని అందిస్తున్న సంగతి విదితమే.