భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కానీ, ఒక్కరికి మాత్రం మహదానందం కలిగించింది. అతనెవరో కాదు.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి. యోగ్‌రాజ్ సింగ్.
భారత క్రికెట్‌లో వన్డే, టీ20ల కెప్టెన్‌గా తప్పుకున్నట్టు.. కానీ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని ధోనీ ఇటీవల ప్రకటించాడు. ఈ సంచలన నిర్ణయంతో పలువురు ధోనీని పొగుడుతూ, బాధపడుతూ స్పందించారు.