ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : నేడు న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ - కివీస్ బ్యాటింగ్

శనివారం, 4 నవంబరు 2023 (11:27 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో శనివారం రెండు పెద్ద జట్లు అయిన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల కీలక మ్యాచ్ ప్రారంభమైంది. బెంగుళూరు వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ నెగ్గిన పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మరోవైపు, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుతో కలిసి బరిలోకి దిగుతున్నాడు. దీంతో ఆ జట్టు మరింత ఉత్సాహంతో మైదానంలోకి దిగింది. 
 
సెమీస్‌లో అడుగుపెట్టడానికి ఇరు జట్లకూ ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకంగా మారింది. ఒక వేళ పాకిస్థాన్ ఓడిపోతే మాత్రం మూటముల్లె సర్దుకుని ఇంటిదారి పట్టాల్సివుంటుంది. అలాగే, కివీస్ జట్టుకు ఓటమి ఎదురైతే మాత్రం సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారుతాయి. అదేసమంలో ఈ మ్యాచ్ కోసం కివీస్ జట్టులో మూడు మార్పులు చేసింది. విల్ యంగ్ స్థానంలో కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీకి బదులు ఐష్ సోథి, నీషమ్ స్థానంలో చాప్‌మన్‌లను చోటుకల్పించారు. ఇక పాక్ జట్టులో కేవలం ఒక్క మార్పు మాత్రమే ఉంది. ఉసామా మిర్ ఆడటం లేదు. హాసన్ అలీ తుది జట్టులోకి వచ్చినట్టు కెప్టెన్ బాబర్ అజమ్ వెల్లడించారు. 
 
ఇరు జట్ల వివరాలు...
పాకిస్థాన్ : అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, సౌద్ షకీల్, అఘా సల్మాన్, షహీన్ ఆఫ్రిది, హాసన్ అలీ, మహమ్మద్ వాసిమ్ జూనియర్, హారిస్ రవూఫ్. 
 
న్యూజిలాండ్ : డ్వేన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, ఐష్ సోథి, టిమ్ సోథీ, ట్రెంట్ బౌల్ట్ 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు