ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి సూపర్-4 మ్యాచ్ భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత మరోమారు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లల 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లలో ఫర్హాన్ (58) ఒక్కడే అర్థ శతకంతో రాణించాడు. ఆ తర్వాత 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్... ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. దీంతో నాలుగు వికెట్లను కోల్పోయి విజయభేరీ మోగించింది.
ముఖ్యంగా, భారత ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ క్రమంలో అభిషేక్ వర్మ 39 బంతుల్లో 74, శుభమన్ గిల్ 28 బంతుల్లో 47 చొప్పున తొలి పది ఓవర్లలోనే ఏకంగా 105 పరుగులను రాబట్టారు. తద్వారా భారీ భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్థాన జట్టు ఓటమిని ఖరారు చేశారు.
ఈ మ్యాచ్‌పై పాక్ ఆటగాడు డానిష్ కనేరియా స్పందిస్తూ, సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే 47 సంకేతం చూపిస్తే శుభమన్ గిల్, అభిషేక్ వర్మ తమ బ్యాట్లతో ఏకంగా బ్రహ్మోస్‌లనే ప్రయోగించారు. భారత ఓపెనర్ల ఎదురుదాడికి పాక్ బౌలర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారు. కొట్టడం వేరు.. చితక్కొట్టడం వేరు. ఇది రెండో రంకం.. దాన్ని మామూలుగా అనరు.. మహా ఉతుకుడు అంటారు. అని అన్నారు. అభిషేక్, శుభమన్ గిల్ వంటి క్లాస్ ఓపెనర్లు ఉన్నపుడు ఇలాంటి పిచ్‌పై 200 పరుగులు లక్ష్యం కూడా చిన్నదేనని చెప్పారు.
పైగా, ఓటమి తర్వాత కుంటి సాకులు వెతకడం పాకిస్థాన్ జట్టుకు అలవాటేనని ఆయన విమర్శించారు. ఇపుడు వారు ఫఖర్ జమాన్ ఔట్‌ను బలిపశువును చేస్తున్నారు. తాను ఔట్ కాలేదని అతడు ఇపుడు ఏడుస్తున్నాడు.. కానీ సంజూ శాంసన్ పట్టింది స్పష్టమైన క్యాచ్. గ్లోవ్స్ బంతి కింద ఉన్నాయి. అయినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటూ పాకిస్థాన్ దీనిపై రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు.