పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. షాదాబ్ మేనత్త కన్నుమూశారు. వరల్డ్ కప్లో ఆడేందుకు భారత్కు వచ్చిన షాదాబ్.. తన మేనత్త చనిపోయారనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మేనత్త ఆత్మకు శాంతి చేకూరాలని, అందుకు ప్రార్థనలు చేయాలని అభిమానులను షాదాబ్ ఖాన్ కోరాడు.