పాకిస్థాన్ యువ బౌలర్ ప్రపంచ రికార్డు

ఆదివారం, 6 అక్టోబరు 2019 (12:36 IST)
పాకిస్థాన్ యువ బౌలర్ మహ్మద్ హుస్నైన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. తాను ఆడిన రెండో మ్యాచ్‌లోనే హ్యాట్రిక సాధించాడు. తద్వారా హ్యాట్రిక్ సాధించిన అతి పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందాడు. 
 
లాహోర్‌లో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ యువ బౌలర్ మహ్మద్ హస్నైన్ వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగట్టి ఆడిన రెండో టీ20లోనే హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన మహ్మద్ 37 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
 
16వ ఓవర్ చివరి బంతికి రాజపక్స (32) పెవిలియన్ పంపిన మహ్మద్ తిరిగి 19వ ఓవర్ తొలి బంతికి షనక(17), రెండో బంతికి జయసూర్య (2)లను అవుట్ చేశాడు. ఫలితంగా టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్నవయస్కుడిగా సరికొత్త రికార్డును తన పేరుపై రాసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు