టెస్టుల్లో ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్!!

ఠాగూర్

శనివారం, 28 సెప్టెంబరు 2024 (17:19 IST)
భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఆసియాలోనే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అవతరించాడు. కాన్పూర్ వేదికగా పర్యాటక బంగ్లాదేశ్ జట్టుతో భారత్ రెండో మ్యాచ్ శుక్రవారం నుంచి జరుగుతుంది. ఇందులో అశ్విన్ ఈ అరుదైన ఘతన సాధించాడు. 
 
ఈ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో భాగంగా 29వ ఓవరులో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోను పెవిలియన్ పంపించడం ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం ఆసియాలో అశ్విన్ టెస్టుల్లో 420 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
 
కాగా, గతంలో ఈ రికార్డు 419 వికెట్లతో భారత మరో లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. ఇప్పుడు కుంబ్లే రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మరో దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 300 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
 
కాగా, 2011లో వెస్టిండీస్‌పై అశ్విన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన 38 ఏళ్ల ఈ స్పిన్ ఆల్‌రౌండర్ 522 వికెట్లు పడగొట్టాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు