తెలుగు తేజం, కడపబిడ్డ, నల్లపురెడ్డి శ్రీచరణిపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతోనే టీమిండియా విజేతగా నిలిచిందని కొనియాడాడు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది.