ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం దాయాది దేయాలైన భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా కీలక కామెంట్స్ చేశాడు. పక్కా ప్రణాళికలను అమలు చేయగలిగితే తాము ఏ జట్టునైనా ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు.
తమ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా వుంది. బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలదు. మంచి స్పిన్నర్లు వున్నారు. దుబాయ్‌లో ఆడుతున్నప్పుడు ఎక్కువ మంది స్పిన్నర్లు ఉండటం చాలా అవసరం.
కానీ బ్యాటింగ్ మాత్రం మెరుగుపడాలి. బ్యాటింగ్ విషయంలో తామింకా కష్టపడాలని సల్మాన్ అఘా అంగీకరించాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో తాము మొదట 180కి పైగా పరుగులు చేయాల్సింది. కానీ క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని సల్మాన్ వెల్లడించాడు.