#RohitSharma: హిట్ మ్యాన్ అదుర్స్.. రికార్డుల పంట.. వరల్డ్ కప్ చరిత్రలో..?

బుధవారం, 11 అక్టోబరు 2023 (22:12 IST)
Rohit Sharma
ప్రపంచ కప్ చరిత్రలో హిట్ మ్యాన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ కప్‌లలో టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు ఆ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ వరల్డ్ కప్‌లలో 6 సెంచరీలు చేశాడు. ఈ రికార్డును 7 సెంచరీలతో రోహిత్ శర్మ అధిగమించాడు. 
 
63 బంతుల్లోనే 100 పరుగులు సాధించిన రోహిత్ శర్మ... టీమిండియా తరఫున వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ వరల్డ్ కప్‌లో 72 బంతుల్లో సెంచరీ చేశాడు.
 
ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా సారథి రోహిత్ శర్మ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ విజృంభించాడు. నవీనుల్ హక్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కొట్టిన సిక్స్‌తో క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. 
 
అంతర్జాతీయ క్రికెట్లో క్రిస్ గేల్ 553 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడా రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. అంతేకాదు, రోహిత్ శర్మ వరల్డ్ కప్‌లలో 1000 పరుగుల మార్కును కూడా దాటాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు