భారత ఓపెనర్ రోహిత్ శర్మ క్లాస్ సెంచరీ సాధించాడు. చటేశ్వర్ పుజారాతో కలిసి అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్, కెఎల్ రాహుల్ అద్భుతంగా ప్రారంభించారు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఉదయం సెషన్‌లో 46 పరుగుల వద్ద రాహుల్‌ను అవుట్ చేశాడు.