అలాగే, ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు కూడా ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ స్టేడియంలో రెండు జట్లు మూడు మ్యాచ్‌లలో పరస్పరం తలపడగా, టీమిండియా రెండు మ్యాచ్‌లు, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. మరోవైపు, ఈ మ్యాచ్ జరిగే ఆదివారం రోజున వాతావరణం పొడిగా ఉంటుందని, పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 33 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, వర్షానికి ఏమాత్రం తావు లేదని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది.