విరాట్ కోహ్లి కంటే సచిన్ అత్యుత్తమం: గంభీర్

గురువారం, 21 మే 2020 (20:59 IST)
వన్డే ఫార్మాట్‌లో మెరుగైన బ్యాట్స్‌మెన్‌లలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే లెజండరీ ఆటగాడు సచిన్ టెండుల్కర్ గొప్ప ఆటగాడని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఆటలో మారిన నియమాలు మరియు సచిన్ కెరీర్ సాగిన సమయాన్ని పరిగణనలోకి తీసుకున్నాడు. 
 
2013లో పదవీ విరమణ చేసిన టెండూల్కర్ 463 వన్డేలు ఆడి 44.83 సగటుతో 49 సెంచరీలతో 18,426 పరుగులు చేసాడు. మరోవైపు, కోహ్లీ 248 వన్డేలు ఆడాడు మరియు 59.33 సగటుతో 43 శతకాలతో 11,867 పరుగులు చేసాడు. కాగా ప్రస్తుతం ఆటలో మారిన నిబంధనలు బ్యాట్స్‌మెన్‌కు సహాయపడుతున్నాయని అభిప్రాయపడ్డారు.
 
సచిన్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒకే వైట్ బాల్‌తో ఆడేవారు. అలాగే సర్కిల్‌లోపు నలుగురు ఫీల్డర్‌లు ఉండేవారు, అయితే వెలుపల ఐదుగురు ఫీల్డర్‌లు ఉండేవారు కాదు. కాగా ప్రస్తుతం రెండు వైట్ బాల్‌లు, అలాగే మూడు పవర్‌ప్లేలతో వన్డే ఇన్నింగ్స్ ఆడతారు. పవర్‌ప్లేలలో కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఫీల్డింగ్‌లో చేసే మార్పులు ఇప్పటి బ్యాట్స్‌మెన్‌కు బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకే తనకు సచిన్ అత్యుత్తమ ఆటగాడని గంభీర్ వివరించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు