ఇంతకీ ఆ ఫోటోకు ఏం క్యాప్షన్ ఇచ్చాడో తెలుసా. ఆటలో ముందుండే సచిన్.. చదువుల్లో మాత్రం మంచి మార్క్‌లు స్కోర్ చేయలేదట. ఆ విషయాన్ని తన ఫోటో క్యాప్షన్ ద్వారా చెప్పేశాడు. పుస్తకం పట్టుకుని ఉన్నా, ఆ రంగంలో స్కోర్‌ను పరుగెత్తించడంలో వెనుకబడి ఉన్నట్లు మాస్టర్ బ్లాస్టర్ తెలిపారు.
చిన్నతనంలో తానో అల్లరి పిల్లవాడినని, పేరెంట్స్‌ను చాలా ఇబ్బంది పెట్టేవాడినని గతంలో సచిన్ చెప్పేవాడు. కాగా, 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్ దాదాపు 200 టెస్టులు ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్ 34347 రన్స్ చేశాడు. అందులో వంద సెంచరీలు కూడా ఉన్నాయి. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేసిన సచిన్... 2013లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.