మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకుండా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో మద్యపానం, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు విముక్తి పేరిట ఈ నెల 20న ప్రారంభించే అవగాహన కార్యక్రమానికి సచిన్ హాజరవుతారు. ఈ కార్యక్రమం ద్వారా మితాహారాన్ని ప్రమోట్ చేయడంతో పాటు మత్తుమందుల దుర్వినియోగంతో వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తారు.
సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం 'విముక్తి' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సచిన్ ఇప్పటికే అంగీకరించారని కేరళ ఆరోగ్య మంత్రి టీపీ రామకృష్ణన్ అసెంబ్లీలో వెల్లడించారు. 'విముక్తి' మిషన్‌ను మరింత ప్రభావంతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ సేవలు తోడ్పడగలవని రామకృష్ణన్ వ్యాఖ్యానించారు.