భార్య విడాకులు ఇచ్చిందని ఓ భర్త అన్నపానీయాలు మానేసి ఏకంగా వంద బీర్లు తాగిన ఘటన ఒకటి చోటుచేసుకుంది. భార్య విడాకులు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి నెల రోజుల పాటు ఆహారం తీసుకోకుండా కేవలం బీర్లు మాత్రమే తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది.
44 యేళ్ల థవీసక్‌కు అతని భార్య విడాకులు ఇచ్చింది. వారికి 16 యేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడిని థవీసక్ వద్దే ఉంచి ఆమె వెళ్లిపోయింది. భార్య తనను వదిలి వెళ్లడంతో తీవ్ర వేదనకు గురైన థవీసక్ ఆహారం తీసుకోవడం పూర్తి మానేశాడు. రోజంతా బీర్లు తాగుతూ గడిపాడు.
దీంతో అతని శరీరంలోని అవయవాలు సరిగా పని చేయకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ఒక స్వచ్ఛంధ సంస్థ థవీసక్‌ను ఆస్పత్రిలో చేర్పించాలని ప్రయత్నించింది.
అయితే, స్వచ్ఛంధ సంస్థ సభ్యులు అతని ఇంటికి చేరుకునేలోపే థవీసక్ మరణించాడు. విచారణ జరిపిన అధికారులు అతని గదిలో 100 బీరు సీసాలను గుర్తించారు. అధిక మొత్తంలో మద్యం సేవించడం వల్లే అతని మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.