ఫోన్ అడిగితే పగులకొట్టాడట.. జయసూర్యపై ఐసీసీ రెండేళ్ల నిషేధం..

బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:50 IST)
శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యపై ఐసీసీ నిషేధం వేటు వేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సనత్ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించింది. జయసూర్య అవినీతిపై 2017లోనే విచారణ ప్రారంభమైందని.. విచారణలో భాగంగా జయసూర్య ఫోన్ సంభాషణే కీలకంగా ఉన్నట్లు గుర్తించామని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ వెల్లడించారు. 
 
విచారణ కోసం ఫోన్ ఇవ్వాల్సిందిగా సనత్ జయసూర్యను కోరినా.. ఫలితం లేదని.. జయసూర్య ఫోన్ ఇచ్చేందుకు తిరస్కరించారని.. ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపారు. జయసూర్యపై విధించిన రెండేళ్ల నిషేధం గతేడాది అక్టోబర్ 16 నుంచి అమలవుతుందని తెలిపారు. 
 
కాగా, ఈ నిషేధాన్ని తాను అంగీకరిస్తున్నాననీ, దీనిపై ఎలాంటి అప్పీల్ చేయబోనని జయసూర్య తెలిపారు. 1996 వన్డే ప్రపంచకప్ ను శ్రీలంక గెలుచుకోవడంలో జయసూర్య కీలకపాత్ర పోషించారు. విచారణ సందర్భంగా సహకరించకుండా సాక్ష్యాలను ధ్వంసం చేశారు. అయితే గత చరిత్ర బాగుండటంతో ఆయనపై రెండేళ్ల నిషేధంతో సరిపెట్టినట్ల అలెక్స్ మార్షల్ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు