ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తూ.. పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మెంటార్ ధోని పాక్ ఆటగాళ్లను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్న ఫొటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ వీడియోను సానియా మీర్జా రీషేర్ చేయగా... నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఇరు దేశాల అభిమానులు.. ''ఇది చాలా క్యూట్‌గా ఉంది'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సానియా మీర్జా సైతం.. స్మైలింగ్ ఎమోజీలతో పాటు రెండు హార్ట్ సింబల్స్ జతచేసి హర్షం వ్యక్తం చేశారు. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా- షోయబ్ మాలిక్ 2018లో కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.