టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మహిళా ఎయిర్‌స్టయిలిస్ట్ బాడీగార్డ్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. సప్నా బహ్వాని మాజీ బిగ్ బాస్ కంటిస్టెంట్. మహేంద్ర సింగ్ ధోనికి ఈమె స్నేహితురాలు, హెయిర్ స్టైలిస్ట్. తాజాగా ఈమె ధోనీకి బాడీగార్డ్‌గా మారింది. ఎలాగంటే..? ముంబైకి 23 కిలోమీటర్ల దూరంలో వున్న థానేకు ధోనీ ఓ ప్రకటన షూటింగ్ కోసం వచ్చాడు.
అక్కడి వేలాదిమంది ఫ్యాన్స్ వచ్చి చేరారు. రావడమే కాకుండా ధోనీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఒక దశలో ధోనీపై పైకి ఫ్యాన్స్ ఎగబడటంతో ఇక స్వప్నా రంగంలోకి దిగింది. ధోనీ కారు ఎక్కేందుకు స్వప్నా బాడీగార్డ్‌గా సహకరించింది. ధోనీకి ముందు నడుస్తూ.. రెండు చేతులు చాస్తూ వెళ్ళింది. అలా ధోనీని జాగ్రత్తగా కారు ఎక్కించేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.