సారా అలీ ఖాన్ ప్రేమలో శుభమన్ గిల్.. మరి సచిన్ కూతురు.? (Video)

మంగళవారం, 30 ఆగస్టు 2022 (15:43 IST)
sara
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రేమలో వున్నారని బిటౌన్ కోడై కూస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ మీడియా కంటపడ్డారు. 
 
ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. అయితే, ఓ అభిమాని ఆ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో వదలడంతో.. ఇప్పుడు అవి వైరల్‌గా మారిపోయాయి.
 
ఈ వీడియోలో వెయిటర్ కు ఆర్డర్ చేయడం కూడా వీడియోలో రికార్డు అయ్యింది. సారా గులాబీ రంగు దుస్తులలో కనిపించగా, శుభ్‌మన్ తెలుపు, ఆకుపచ్చ రంగు చొక్కా ధరించారు. ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 
 
కాగా, క్రికెట్‌ గార్డ్‌ సచిన్ కూతురు సారాతో గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు మరోసారా.. అంటే సారా అలీఖాన్‌తో కనిపించడంతో కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  
 
సారా అలీ ఖాన్ నటులు సైఫ్ అలీ ఖాన్ మరియు అమృతా సింగ్‌ల కుమార్తె. ఆమె మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరియు షర్మిలా ఠాగూర్‌ల మనవరాలు కూడా.
 
ఇక, వెస్టిండీస్- జింబాబ్వేతో జరిగిన వన్డేలో రెండు బ్యాక్-టు-బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్న శుభ్‌మాన్ గిల్, ఇప్పటివరకు 11 టెస్టులు మరియు 9 వన్డేల్లో ఆడాడు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు