భారత క్రికెట్ జట్టుకు పదవి తనకు ఎందుకు దక్కలేదో చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్, క్రికెట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఈ విషయంపై నేను మాట్లాడేది ఏమీ లేదు.. సెహ్వాగ్ ఓ పిచ్చోడిలా మాట్లాడాడు అని దాదా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
బీసీసీఐ కోరిక మేరకు చివరి నిమిషంలో వీరూ కోచ్ పదవి కోసం అప్లై చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ మాత్రం రవిశాస్త్రిని కోచ్‌ను చేసింది. అయితే ఈ విషయంలో వీరూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరింత లోతుగా స్పందించడానికి గంగూలీ నిరాకరించాడు.
అసలు సెహ్వాగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత జట్టు చీఫ్ కోచ్ పదవికి తాను ఎందుకు ఎంపిక కాలేదో వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. బీసీసీఐలో కీలక నిర్ణయాలు తీసుకునే పెద్దలను తాను మేనేజ్ చేయలేకపోయానన్నాడు. భవిష్యత్‌లో మరోసారి కోచ్ పదవికి దరఖాస్తు చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశాడు.