టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో చలోక్తులు విసురుతూ, జోకులు పేలుస్తూ, పంచ్‌లు విసిరే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ పార్థివ్ పటేల్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 10 వేల పరుగులు సాధించిన పార్థీవ్ పటేల్‌ను అభినందిస్తూ.. 10,000 ముబారక్ పీపీ ఉరఫ్ సీసీ.. అంటూ ట్వీట్ చేశాడు. తొలుత 'పీపీ', 'సీసీ' అంటే ఎవరని ఆలోచించిన వారికి 'పీపీ' అంటే పార్థివ్ పటేల్ అని అర్థమైపోయింది. ఇక 'సీసీ' అంటే ఎవరన్నది తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. 'సీసీ' అంటే చోటా చేతన్ అని అర్థం.