బుమ్రా స్థానంలో ఎవరు.. షమీనా.. లేకుంటే సిరాజా?

మంగళవారం, 11 అక్టోబరు 2022 (13:59 IST)
వెన్ను గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌‍కు జస్ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పటితే బుమ్రా మినహా జట్టు మొత్తం ఆస్ట్రేలియాకు చేరుకుంది. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లలో ఒకరిని జట్టుతో పంపవచ్చునని వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, షమీపై ఎక్కువ ఆశలు ఉన్నాయి. ఆస్ట్రేలియా పిచ్ సీమ్‌లు, బౌన్స్‌ల కారణంగా షమీపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి షమీ అక్కడ బాగా బౌలింగ్ చేయగలడని బీసీసీఐ భావిస్తోంది. దీంతో పాటు సిరాజ్ కంటే అనుభవజ్ఞుడిగా షమీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 
 
మహ్మద్ షమీ గత ఏడాది T20 ప్రపంచకప్ సందర్భంగా నమీబియాతో T20 ఫార్మాట్‌లో చివరిగా ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఈ ఆటగాడు అద్భుత ప్రదర్శన చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చి గెలుపొందాడు.
 
మహ్మద్ షమీతో పాటు మహ్మద్ సిరాజ్ కూడా ప్రపంచకప్‌లో జట్టులో భాగం కానున్నాడు. అతను రిజర్వ్ ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా లేకపోవడం ప్రపంచకప్‌లో టీమిండియాకు భారీ లోటుగా మారనుంది.   
 
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ , అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.
 
రిజర్వ్ ఆటగాళ్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు