టీమిండియా తప్పక ప్రపంచ కప్‌ను గెలుచుకుంటుంది.. గంగూలీ

శనివారం, 15 డిశెంబరు 2018 (16:54 IST)
బ్రిటన్‌లో వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ ప్రపంచ కప్‌ను భారత జట్టే కైవసం చేసుకునే అవకాశం వుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత్ చేతికే ప్రపంచ కప్ వస్తుందని.. టీమిండియా నుంచి కప్‌ను గెలుచుకునే అవకాశం ఏ జట్టుకు రాకపోవచ్చునని గంగూలీ వ్యాఖ్యానించాడు.


ప్రపంచ కప్ క్రికెట్ పండుగలో భాగంగా.. వచ్చే ఏడాది బ్రిటన్‌లో ఈ పోటీలు జరుగనున్నాయి. 2019 మే నెల 30వ తేదీ నుంచి జూలై -14వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. 
 
ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రపంచ కప్ ట్రోఫీని ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన భారత్‌కు తీసుకురావడం జరిగింది. తొలుత డిసెంబర్ రెండో తేదీన ముంబైలో, డిసెంబర్ 8వ తేదీన బెంగళూరులో.. శుక్రవారం (డిసెంబర్ 14) కోల్‌కతాలోనూ ప్రదర్శనకు వుంచారు. చివరిగా ఈ నెల 23వ తేదీ ఢిల్లీలో గుర్గామ్‌లో ప్రపంచ కప్‌ను ప్రదర్శనకు వుంచారు. 
 
ఈ నేపథ్యంలో కోల్‌కతాలో ప్రపంచ కప్‌ ప్రదర్శనలో పాల్గొనన్ సౌరవ్ గంగూలీ.. మీడియాతో మాట్లాడుతూ.. ఐసీసీ 2019 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచేందుకు భారత్‌కు అవకాశాలున్నాయని, టీమిండియా తప్పకుండా ప్రపంచ కప్ గెలుస్తుందని సౌరవ్ ధీమా వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు