భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం - సఫారీల తడబాటు

ఆదివారం, 17 డిశెంబరు 2023 (15:37 IST)
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆదివారం నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. మొత్తం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జోహనెన్స్‌బర్గ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌‌లో తొలుత సఫారీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా భారత బౌలర్లధాటికి సఫారీలు 73 పరుగులకే ఎనిమిది వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 
 
ఆ జట్టులో ఓపెనర్ హెండ్రిక్స్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ జోర్జి 28 పరుగులు చేశాడు. ఆతర్వాత డెర్ డుస్సెన్ 0, కెప్టెన్ మార్క్‌రమ్ 12, క్లాసెన్ 6, డేవిడ్ మిల్లర్ 2, ముల్డర్ 0, మహరాజ్ 4 చొప్పున పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజ్‌లో అండిలీ 24, బర్గర్ 4 పరుగుల చొప్పున క్రీజ్‌లో ఉన్నారు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో కేఎల్ రాహుల్, గ్వైకాడ్, సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్సర్ పటేల్, హర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు