భారత్‌ క్రికెట్ జట్టు 3 టెస్ట్‌ల సిరీస్ : సౌతాఫ్రికా జట్టు ఎంపిక

మంగళవారం, 7 డిశెంబరు 2021 (15:00 IST)
భారత్ క్రికెట్ జట్టు త్వరలో సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టును ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 15 తేదీ వరకు టెస్ట్ సిరీస్ జరుగనుంది. మొత్తం మూడు టెస్టులు ఆడనుంది. 
 
ఈ సిరీస్ కోసం 21 మందితో కూడిన సఫారీ జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఇందులో సీనియర్ నటుడు డీన్ ఎల్గార్‌ను కెప్టెన్‌గా ప్రటించారు. అలాగే, టెంబా బవుమా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులో సిసాండ్ మగాలా, రియాన్ తదితరులకు చోటు కల్పించింది. 
 
సఫారీ జట్టు వివరాలు... 
డీఎల్ ఎల్గార్ (కెప్టెన్), బవుమా (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, రబాడా, డుస్సెస్, హెండ్రిక్స్, లిండే, క్రమ్, వియాన్ ముల్డర్, నోర్జే, పీటర్సన్, ఎర్వీ, వెర్రీన్, జాన్సెన్, మహరాజ్, లుంగీ ఎంగిడి, ఒలివియర్, స్టుర్మాన్, సుబ్రాయెన్, మగాలా, రికెల్టన్‌. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు