స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్‌స్టర్, భారతీయ జనతా పార్టీ యువనేత శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు మొదటి సంతానంగా పాప పుట్టిన విషయం తెల్సిందే. ఇది రెండో సంతానం.
ముంబై శాంతాక్రూజ్‌లోని సూర్య ఆసుపత్రిలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని శ్రీశాంత్ చెప్పారు. సూర్య ఆసుపత్రి వాతావరణం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చిన శ్రీశాంత్ బాబుకు సూర్యశ్రీ అని పేరు పెట్టినట్లు తెలిపారు.