ఈ యేడాది ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన సమయంలో టీమ్ లంచ్ మెనూలో ఓ బీఫ్ వంటకాన్ని చూసి అభిమానులు ఫైర్ అయ్యారు. దీంతో బీసీసీఐకి చెందిన ఇద్దరు అధికారులు రెండు వారాల కిందట ఆస్ట్రేలియా వెళ్లారు. క్రికెటర్ల ఆహారం, ప్రయాణ ప్రణాళిక రూపొందించేందుకు వెళ్లారు.
దీనికోసం అక్కడి ఓ ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లిన బోర్డు అధికారులు.. క్రికెటర్లు శాకాహార కూరలను సరఫరా చేయాలని కోరారు. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు విదేశీ టూర్లలో క్రికెటర్లు తీసుకునే ఆహారంపై బోర్డు సీరియస్‌గా దృష్టి సారిస్తున్నది. మాంసం సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోనుంది. కాగా, ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా ఇండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.