ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ బాల్ వుమెన్ కాంపిటీషన్ టోర్నీలో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన దుమ్మురేపింది. సదరన్ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంధాన 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలవడమేగాక ఒంటిచేత్తో జట్టును గెలిపించింది.
మంధాన మెరుపులతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే సదరన్ బ్రేవ్ విజయాన్ని అందుకుంది. మంధాన బ్యాటింగ్ విషయాన్ని పరిశీలిస్తే.. మొదటి 25 బంతులకు 29 పరుగులు చేసిన స్మృతి ఆ తరువాతి 14 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 32 పరుగులు చేసింది.
సదరన్ బౌలింగ్‌లో లారెన్ బెల్, వెల్లింగ్‌టన్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సదరన్ బ్రేవ్ వుమెన్ 84 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. స్మృతి 61 నాటౌట్, స్టఫానీ టేలర్ 17 నాటౌట్‌గా నిలిచారు.